ఉబుంటులో టీవి

కంప్యూటర్ లో టీవి చూడడానికి టీవి ట్యునర్ కార్డ్స్(ఇన్ టర్నల్/ఎక్స్ టర్నల్) ఉపయోగిస్తుంటాము. టీవి ట్యునర్ కార్డ్ కంప్యూటర్ కి అమర్చినతరువాత దానితో పాటు వచ్చిన డ్రైవర్స్ ఇన్ స్టాల్ చేసి టీవి చూడవచ్చు. టీవి ట్యునర్ కార్డ్ తో వచ్చిన సిడిలో విండోస్ కి కావలసిన డ్రైవర్స్ మాత్రమే ఉంటాయి. మరి ఉబుంటు మరియు వేరె లినక్స్ పంపకాలు వాడేవారిపరిస్థితి ఏంటి? 

దానికి చక్కని పరిష్కారం TVtime Television Viewer 

దీనిని ఉపయోగించి ఉబుంటు మరియు అన్ని ప్రముఖ లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలలో టీవి చూడవచ్చు. BT878, BT848, SAA7134, SAA7146, Cx2388x చిప్ ఉపయోగించి తయారుచేయబడిన ట్యునర్ కార్డ్స్ కి మద్ధతునిస్తుంది. పూర్తి సమాచారం కొరకు టీవి టైం సైట్ సందర్శించండి. ఇక ఉబుంటులో ఉబుంటు సాప్ట్వేర్ సెంటర్ నుండి నేరుగా స్థాపించుకొవచ్చు. టీవి ట్యునర్ కార్డ్ ని కంప్యూటర్ కి అమర్చినతరువాత టీవి టైం టెలివిజన్ వ్యూయర్ ని ఇన్ స్టాల్ చేసి క్రిందివిధంగా కమాండ్ లైన్(టెర్మినల్) నందు కాన్ ఫిగర్ చేయాలి

$ sudo modprobe -r saa7134_alsa 
$ sudo modprobe -r saa7134_dvb 
$ sudo modprobe -r saa7134 
$ sudo modprobe saa7134 card=42 tuner=69 

పైన కమాండ్ ల నందు గల saa7134, card=42, tuner=69 అన్నవి నాకార్డ్ కి చెందినవి. వాటిని మీకార్డ్ కి సంబందిచినవాటితో మార్చుకోవాలి. పై నాలుగు కమాండ్ లు విజయవంతమైన తరువాత ఐదవ కమాండ్ని రన్ చేయండి

$gksudo gedit/etc/modprobe.d/saa7134 

ఐదవ కమాండ్ ని ర న్ చేయగానే saa7134 అను ఒక కాళి టెక్స్ట్ ఫైల్ ఒపెన్ అవుతుంది. దానిలో options saa7134 card=42 tuner=69 అని టైప్ చేసి ఫైల్ ని సేవ్ చెయ్యలి. 
గమనిక:
1. కాన్ ఫిగర్ చేస్తున్న సమయంలో టీవి టైం టెలివిజన్ వ్యూయర్ ని ఒపెన్ చెయ్యవద్దు.
2. పైన కమాండ్ల నందు గల saa7134,42,69 మీకార్డ్ కి సంబందిచినవాటితో మార్చుకోవాలి. ఈవిధంగా కాన్ ఫిగర్ చేసుకున్న తరువాత టీవి టైం టెలివిజన్ వ్యూయర్ ని ఒపెన్ చేసి చానల్ స్కాన్ చేసుకొని టీవి చూడవచ్చు


ఉబుంటు 12.04 లో టీవి టైం టెలివిజన్ వ్యూయర్
పై చిత్రం లొ వలే మౌస్ రైట్ క్లిక్ చేసినపుడు మెనూ కనిపించును. మెనూ లో సబ్ మెనూలు ఈవిధంగా ఉంటాయి.
మెనూ మరియు సబ్ మెనూలు,ముఖ్యమైన సెట్టింగులు

ఇంటెక్స్ టీవి ట్యునర్ కార్డ్ బాక్స్