యుట్యూబ్ వీడియోలు డౌన్లోడ్ చేసుకోవాలనుకొంటున్నారా?

యుట్యూబ్ లో వీడియోలు చూసేవారు నచ్చిన వీడియోలు డౌన్లోడ్ చేసుకోవడానికి వేరే సైట్లో వీడియో తాలుకు URL ని ఇవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకొంటారు. ఫైర్ ఫాక్స్ వాడేవారు సులభంగా యుట్యూబ్ వీడియో పేజి నుండే మనకు నచ్చిన ఫార్మాట్లో వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం చేయవలసిందల్లా Easy YouTube Video Downloader
అనే యాడ్ ఆన్ ని ఇక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకోవడమే. యాడ్ఆన్ ఇన్స్టాల్ చేసుకొన్న తరువాత యుట్యూబ్ వీడియో క్రింద డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది. డౌన్లోడ్ ని క్లిక్ చేసినపుడు అందుబాటులో ఉన్న ఫార్మాట్ లని చూపించును. మనకి నచ్చిన ఫార్మాట్ ని క్లిక్ చేసినపుడు వీడియో డౌన్లోడ్ కావడం ప్రారంభమవుతుంది. అ వీడియోలు బద్రపరచుకొని మనకు కావలసినపుడు చూసుకోవచ్చు.