ఆపరేటింగ్ సిస్టంలు ఎన్ని?

ఆపరేటింగ్ సిస్టంలు ఎన్ని? అని అడిగితే ఎవరికైనా చెప్పడం కష్టమే. ఒక్క లినక్స్ కర్నేలు పైనే ఎన్నో ఆపరేటింగ్ సిస్టంలు నిర్మించబడ్డాయి. వాటిలో ప్రాచూర్యం పొందిన ఉబుంటు, డెబియన్, లినక్స్ మింట్ వంటి వాటి గూర్చి మాత్రమే మనకు తెలుసు. అసలు లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలు ఎన్ని, వాటి గురించి సమాచారం, అవి ఎక్కడ దొరుకుతాయి?

అనువర్తనములు (అప్లికేషన్) కావలెను

ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టంలలో మూడవది అయిన అయిన ఉబుంటుకి అనువర్తనాలను తయారుచేయండి. అనువర్తనాల తయారుచేయడానికి కావలసిన సమాచారం మరియు అనువర్తనాల తయారి ప్రారంభించడానికి http://developer.ubuntu.com/ ని చూడండి. మీరు తయారుచేసిన అనువర్తనాలు ఉచితంగా అందిచవచ్చును లేదా ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ ద్వారా విక్రయించవచ్చు.

సాఫ్ట్‌వేర్ క్రాకర్లకు (హ్యాకర్లకు) బహిరంగ లేఖ

ప్రియమైన సాఫ్ట్‌వేర్ క్రాకర్లకు (హ్యాకర్లకు),

సగటు పైరేటెడ్ సాఫ్ట్‌వేర్ వాడుకరి వ్రాయునది ఏమనగా...

మీరు ఇప్పటివరకూ ఎన్నో విలువైన వాణిజ్య సాఫ్ట్‌వేర్లను ఉచితంగా మాతో పంచుకున్నారు. మీ అద్భుతమైన ప్రతిభా పాటవాలనూ, విలువైన సమయాన్నీ వెచ్చించి మా కొరకు చాలా కృషి చేసారు. మీ వల్ల లాభం పొందిన మేము మీకు

యమ్.ఎస్.ఆఫీస్ కి ఉచిత ప్రత్యామ్నాయాలు

ఆఫీస్ ప్రత్యామ్నాయాలలో మొదట చెప్పుకోవలసింది లిబ్రేఆఫీస్. ఇది పూర్తిగా ప్రజలచే, ప్రజల కొరకు తయారుచేయబడినది. ఓపెన్ సోర్స్ ప్రపంచం మద్దతు దీనికే. ఎటువంటి వాణిజ్య సంస్థల నియంత్రణ లేకుండా నడుస్తున్నది. అన్ని ఆపరేటింగ్ సిస్టములలో పనిచేస్తుంది. ఉబుంటు మరియు కొన్ని లినక్స్ పంపకాలతో అప్రమేయంగా అందించబడుతుంది. మిగిలిన ఆపరేటింగ్ సిస్టములు

వర్డ్ డాక్యూమెంట్లను వాడకండి

ఆఫీస్ అవసరాలకు వాడే సాఫ్ట్వేర్ని ఆఫీస్ సూట్ అంటారు. ఒక సాదారణ ఆఫిస్ సూట్లొ వ్యాసాలు రాయవచ్చు, ప్రసెంటేషన్లు ఇవ్వవచ్చు, కంపెనీ ఖతాలు దాచటం వంటి పనులతొ పాటూ మరెన్నో పనులు కూడా చెయ్యవచ్చు. అన్ని ఆఫీస్ సూట్లలోనూ ఎక్కువగా వాడే ఆఫీస్ సూట్ "మైక్రొసాఫ్ట్ ఆఫీస్". మైక్రొసాఫ్ట్ ఆఫీస్‌లొ వ్యాసాలు రాయటానికి వాడే

ఫ్రీ సాఫ్ట్వేర్ ఉద్యమం

నిత్యజీవితంలో కంప్యూటర్లు, సెల్ ఫోన్లు ఇతర గాడ్జెట్లు సగటు మనిషి జీవితంతో సైతం పెనవేసుకుపోతున్నాయి. కంప్యూటర్‌ లిటరేట్ అయి ఉండటం భావి తరాలవారికి ఒక కంపల్షన్‌గా మారింది. కంప్యుటర్ ఇంటర్నెట్ ఆవిష్కరణలు అనేక నూతన సాంప్రదాయాలకు కూడా నాంది పలికాయి. విజ్ఞాన సర్వస్వం ప్రజలకు అందుబాటులో ఉండాలి అని

మీ పిల్లల సృజనాత్మకతని వెలికితీయడం కోసం

చిన్నపిల్లల కోసం ఓపెన్ సోర్స్ ప్రపంచం అనేక సాఫ్ట్వేర్లని అందించింది. వాటిలో అత్యధిక ప్రజాధరణ పొందిన, పిల్లల మనసులని గెలిచిన, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది విద్యార్ధులచే మరియు విద్యాసంస్థలచే వాడబడుతున్న, చాలా పత్రికల, వెబ్ సైట్ల రివ్యూలు, రేటింగ్లు పొందిన సాఫ్ట్వేర్, పూర్తిగా ఉచితంగా లభించే సాఫ్ట్వేర్ టక్స్ పెయింట్. ఉబుంటు వాడేవారు

మాతృభాష లో ఆన్ స్క్రీన్ కీబోర్డ్

ప్రతి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంలో ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అనువర్తనము తప్పకుండా ఉంటుంది. దీనిలో మన కంప్యుటర్ కీబోర్డ్ లో ఉన్నట్టుగానే ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. ఆన్ స్క్రీన్ కీబోర్డ్ లో అక్షరాలు తెలుగులో కావాలనుకొంటే తప్పనిసరిగా ఇండిక్ ఆన్ స్క్రీన్ కీబోర్డ్ (IOK) అను చిన్న అనువర్తనమును వాడవచ్చు. దీనిని ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా

మీ డెస్క్ టాప్ ని వీడియో తీయడానికి

మనం ఏదైనా సాఫ్ట్వేర్ వాడే విధానం గురించి ఇతరులకి తెలియచేయడానికి పాఠ్యరూపంలో వివరించడం లేదా దాని యొక్క చిత్రాన్ని (స్క్రీన్ షాట్) లను చూపించడం ద్వారా వారికి అర్ధమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తుంటాము. ఇంకాసులభంగా అర్ధమవడానికి వీడియో రూపంలో కూడా వివరించవచ్చు. ఈమధ్య ఈవిధానం బాగా ప్రాచుర్యం

వెబ్ కాం డ్రైవర్ల కోసం వెతుకుతున్నారా?

ఉబుంటులో వెబ్ కాం డ్రైవర్ల కోసం వెతకనవసరం లేదు. చాల వెబ్ కాంలు ఎటువంటి డ్రైవర్లు ఇన్స్టాల్ చేయకుండానే పనిచేస్తాయి. మనం చేయవలసిందల్లా ఏదైనా వెబ్ కాం బూత్ సాఫ్ట్ వేర్ ని ఇన్ స్టాల్ చేసుకోవడామే. ఉబుంటు మరియు మిగిలిన లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలలో చాలా వెబ్ కాం బూత్ సాఫ్ట్ వేర్లు ఉన్నప్పటికి చీజ్ అను ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ బాగా

సులభంగా వీడియోలను కన్వర్ట్ చేసుకోండి

నోట్ బుక్, లాప్ టాప్, ఫోన్, టాబ్లెట్, టీవి, కెమేరా మరియు డీవిడీ ప్లేయర్ వంటి పరికరాల వాడకం పెరగడం వలన మన వీడియోలను వివిధ పరికరాలకు తగినట్లు మార్చుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. ఎటువంటి అనుభవం లేనివారు కూడా సులభంగా వీడియోలను కన్వర్ట్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న ఉచిత కన్వర్టర్ అరిస్టా ట్రాన్స్ కోడర్.

స్క్రీన్ షాట్లు తీయడానికి అత్యుత్తమ మార్గం

సాధారణంగా స్క్రీన్ షాట్లు తీయడానికి కీబోర్డ్ లో ప్రింట్ స్క్రీన్ ని ఉపయోగిస్తాము. దాని ద్వారా పూర్తి తెరను మనం ఫొటో తీయవచ్చు. ఇంకా సాధికారతతో అత్యుత్తమమంగా స్క్రీన్ షాట్లు తీయడానికి షట్టర్ అనే ఉచిత అనువర్తనమును ఉపయోగించవచ్చు. ఇది దాదాపు అన్ని లినక్స్ పంపకాలలో అందుబాటులో ఉంది. ఉబుంటులో దీనిని ఉబుంటు సాఫ్ట్వేర్

డెస్క్ టాప్ ని మనకు నచ్చినట్లు మార్చుకోవడానికి

ఉబుంటులో యునిటీ డెస్క్ టాప్ అప్రమేయంగా వాడబడుతుంది. యునిటీ వచ్చిన తరువాత డెస్క్ టాప్ ని మనకు నచ్చినట్లు మార్చుకోవడానికి అవకాశం తగ్గింది. ఉబుంటు12.04 లో యునిటీ అదనపు విశిష్టతలతో పాటు మరింతమెరుగ్గా, వాడుటకు సరళంగా మరియు మరింత స్థిరంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా వాడుకరి మార్చుకోవడానికి కొంత వెసులుబాటు కూడా కల్పించారు.