CNET మొబైల్ వరల్డ్ కాంగ్రేస్ 2013 ఉత్తమం గా ఎంపికైన


 ఈరోజు ముగిసిన మొబైల్ వరల్డ్ కాంగ్రేస్ 2013 లో CNET వారి ఉత్తమ ఎంపికగా ఉబుంటు టచ్ ఎన్నికయినట్లు ప్రకటించారు. తయారీదారుల, మొబైల్ ఆపరేటర్ల ఆదరణ పొందిన ఫైర్ ఫాక్స్ చివరి వరకు పోటీలో నిలిచి రెండో స్థానంలో నిలిచినది.
ఉబుంటు టచ్ గురించిన CNET విశ్లేషణ క్రింది వీడియోలో చూడవచ్చు.

మరికొన్ని ఫోన్లు, టాబ్లెట్ల కోసం ఊబుంటు టచ్ ఆందుబాటులోకి రానుంది.

 మొదట గూగుల్ నెక్సాస్ ఫోన్లు టాబ్లెట్లలో మాత్రమే ఇన్ స్టాల్ చేయడానికి విడుదల అయిన ఉబుంటు టచ్(ఫోన్లు, టాబ్లెట్ల కోసం ఊబుంటు ఆపరేటింగ్ సిస్టం) ఇప్పుడు మరికొన్ని ఫోన్లు, టాబ్లెట్ల కోసం ఆందుబాటులోకి రానుంది. ఉబుంటు టచ్ ఇన్ స్టాల్ చేయదగిన ఫోన్లు, టాబ్లెట్ల పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి.

మొబైల్ వరల్డ్ కాంగ్రేస్ 2013 లో ప్రదర్శించబడిన మొట్టమొదటి ఫైర్ ఫాక్స్ ఫోన్లు

 బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రేస్ 2013 లో మొట్టమొదటి ఫైర్ ఫాక్స్ ఫోన్లని ప్రదర్శించారు. HTML5 తో శక్తివంతమై, స్వేచ్ఛా సాఫ్ట్వేర్ అయిన ఫైర్ ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం తో నడిచే ఆల్కాటెల్ వన్ టచ్ ఫైర్ మరియు ZTE ఒపెన్ అను రెండు ఫోన్లని ప్రదర్శించారు. ఆల్కాటెల్, ZTE తోపాటు హువాయ్ మరియు LGలు రానున్న వేసవిలో ప్రపంచవ్యాప్తంగా ఫైర్ ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం తో నడిచే ఫోన్లని విడుదల చేయబోతున్నాయి.
 ఫోన్లని మరియు ఫైర్ ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం యొక్క విశిష్టతలను వివరించే వీడియోని ఇక్కడ చూడవచ్చు.

మొబైల్ వరల్డ్ కాంగ్రేస్ 2013 లో ప్రదర్శించబడిన ఉబుంటు టాబ్లెట్ వీడియో

 ఇప్పటికే ప్రకటించిన ఉబుంటు టచ్ (మొబైల్ మరియు టాబ్లెట్ల కోసం ఉబుంటు) ఆపరేటింగ్ సిస్టం తో నడిచే గూగుల్ నెక్సాస్ ఫోన్లు మరియు టాబ్లెట్లను మొబైల్ వరల్డ్ కాంగ్రేస్ 2013 లో ప్రదర్శించబడినవి. క్రింది వీడియోలో ఉబుంటు ఇన్ స్టాల్ చేసిన నెక్సాస్ 10 టాబ్లెట్ ని  ఉబుంటు టచ్ ఆపరేటింగ్ సిస్టం ముఖ్య విశిష్టతలను చూడవచ్చు.


ఉబుంటు టచ్ సాఫ్ట్వేర్ డెవలపర్ కిట్ ఆల్ఫా విడుదలైంది

 ఉబుంటు టచ్ (ఉబుంటు ఫోన్ మరియు టాబ్లెట్ ఆపరేటింగ్ సిస్టమ్) కి అనువర్తనాలు తయారుచేయడాని ఉబుంటు సాఫ్ట్వేర్ డెవలపర్ కిట్ ఆల్ఫా విడుదలైంది. ఉబుంటు సాఫ్ట్వేర్ డెవలపర్ కిట్ ని మన ఉబుంటు డెస్క్ టాప్ నందు ఇన్ స్టాల్ చేసు కొని ఉబుంటు ఫోన్ మరియు టాబ్లెట్ ఆపరేటింగ్ సిస్టమ్ కి అనువర్తనాలు తయారుచేయవచ్చు. ఉబుంటు సాఫ్ట్వేర్ డెవలపర్ కిట్ ని ఇన్ స్టాల్ చేయుడం మరియు అనువర్తనాల తయారి ఇక్కడ వివరించబడినది. ఉబుంటు ఫోన్ మరియు టాబ్లెట్ ఆపరేటింగ్ సిస్టమ్ కి మొదటి అప్లికేషన్ మీదే కావచ్చు ప్రయత్నించండి.

ఫోన్లు,టాబ్లెట్ల కోసం ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం విడుదలైంది

 ఫోన్లు,టాబ్లెట్ల కోసం కనోనికల్ వారు ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం యొక్క డెవలపర్ ప్రివ్యు ని విడుదలచేసారు. ఫోన్ మరియు టాబ్లెట్ ఆపరేటింగ్ సిస్టం రెండిటిని సంయుక్తంగా ఉబుంటు టచ్ అని నామకరణం చేసారు. గెలాక్సి నెక్సస్, నెక్సస్ 4, నెక్సస్7 మరియు నెక్సస్10 ఫోన్ మరియు టాబ్లెట్ల లలో ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం(ఉబుంటు టచ్ డెవలపర్ ప్రివ్యు) ని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఆయా ఇన్ స్టాలేషన్ ఇమేజి లను ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ స్టాల్ చేయు విధానమును సవివరంగా ఇక్కడ చూడవచ్చు.


టైజెన్ 2 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం విడుదలైనది

 ఇంటెల్ ,సాంసంగ్ ,డొకోమో వంటి దిగ్గజ కంపెనీల ఆరధ్యంలో లినక్స్ ఫౌండేషన్ వారు అభివృధ్ది చేస్తున్న టైజెన్ 2 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం యొక్క సాఫ్ట్వేర్ డెవలపర్ కిట్ మరియు సోర్స్ కోడ్ విడుదలైనది.దానికి సంబందించిన విడుదల పాఠాన్ని ఇక్కడ చూడవచ్చు.సాఫ్ట్వేర్ డెవలపర్ కిట్ ని(విండోస్,ఉబుంటు మరియు మాక్ ఆపరేటింగ్ సిస్టం ల కొరకు) ఇక్కడ నుండి పొందవచ్చు. టైజెన్ 2 మొబైల్ ఆపరేటింగ్ సిస్టంని క్రింది చిత్రాలలోచూడవచ్చు.








ఉబుంటు టాబ్లెట్

 తొందరలో ఉబుంటు టాబ్లెట్ ఆపరేటింగ్ సిస్టం ని విడుదలచేయబోతుంది. దానికి సంబంధించిన చలన చిత్రాన్ని మరియు చ్రిత్రాలను విడుదల చేసారు. ఆకర్షణీయమైన ఉబుంటు టాబ్లెట్ ఆపరేటింగ్ సిస్టం గురించిన మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

ఫైర్ ఫాక్స్ 19 విడుదలైంది

 ప్రముఖ ఒపెన్ సోర్స్ వెబ్ బ్రౌసర్ అయిన ఫైర్ ఫాక్స్ యొక్క కొత్త వెర్షను ఫైర్ ఫాక్స్ 19 విడుదలైంది. PDF ఫైళ్ళను తెరవడానికి కావలసిన సామర్ధ్యం, మెరుగు పరచబడిన యాడ్ ఆన్ల మెమొరీ వాడకం, అభివృధ్ది పరచబడిన విశిష్టతలతో మరియు సవరించిన దోషాలతో విడుదల కాబోతుంది. దీనిని ఉచితంగా ఫైర్ ఫాక్స్ వెబ్ సైటు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఫైర్ ఫాక్స్ వాడుతున్నవారు అప్ డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఉబుంటు వాడుతున్న వారు ఉబుంటు అప్ డేట్స్ ద్వారా ఫైర్ ఫాక్స్ 19 ని పొందుతారు.

ఆండ్రాయిడ్ 4.2.2 లో మెరుగుపరచబడిన తెలుగు

ఆండ్రాయిడ్ 4.2.2 అప్ డేట్ విడుదలైంది. ఇప్పటి వరకు వచ్చిన వెర్షన్ లలో తెలుగు అక్షరాలు కనిపించేవికావు.  ఆండ్రాయిడ్ 4.2.2 లో దానిని సరిచేసారు. ఇక్కడ ఉన్న బొమ్మలలో మనం దీనిని గమనించవచ్చు. జి మెయిల్,ఫేస్ బుక్ ఇలా ప్రతి ఆప్లికేషన్ లో తెలుగు సరిగా కనిపిస్తుంది.