వందల కొద్దీ ఫొటోలూ ఒకే క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోనే సాఫ్ట్వేర్ ఉచితంగా

 సాధారణంగా వివిధ వెబ్ సైట్లలో గ్యాలరీలుగా ఉంచిన సినితారల ఫొటోలు లేదా ఫేస్ బుక్ వంటి సామాజిక అనుసంధాన సైట్లలో ఉంచిన బంధుమిత్రుల ఫొటోలు మన కంప్యూటర్లో సేవ్ చేసుకోవాలంటే ప్రతి ఫొటోని తెరిచి సేవ్ ఇమేజ్ అన్న ఆప్షన్ని ఉపయోగించి సేవ్ చేసుకుంటాము. ఒకటి రెండు ఫొటోలంటే ఇలా సేవ్ చేసుకోవచ్చు. కానీ వందల ఫొటోలు డౌన్లోడ్ చేయాలంటే మాత్రం ఈ పధ్దతి పనికిరాదు. దీనివలన విసుగు, సమయం వృధా కావడం జరుగుతుంది. సగటు కంప్యూటరు వాడుకరి వందల కొద్దీ ఫొటోలూ ఒకే క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోవాలంటే బల్క్ ఇమేజి డౌన్లోడర్ వంటి సాఫ్ట్వేర్లు కొనుక్కోవలసిందేనా?
 అవసరం లేదు మనం డబ్బులు పెట్టకుండా ఉచితంగా వందల కొద్దీ ఫొటోలూ ఒకే క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసే సాఫ్ట్వేర్ ఉచితంగా పొందవచ్చు. లైక్, షేర్, రిజిస్టర్ మరియు సబ్ స్రైబ్ చేసుకోకుండానే ఎవరైనా ఉచితంగా పొందవచ్చు. ఎందుకంటే ఇది పూర్తిగా ఒపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. డౌన్లోడ్ దెమ్ ఆల్ అన్న ఫైర్ ఫాక్స్ యాడ్ ఆన్ ని ఉపయోగించి ఉచితంగా వందల కొద్దీ ఫొటోలూ ఒకే క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొదట మనం డౌన్లోడ్ దెమ్ ఆల్ అను ఫైర్ ఫాక్స్ యాడ్ ఆన్ ని ఇక్కడ నుండి ఇన్ స్టాల్ చేసుకోవాలి. దీనిని ఉపయోగించి వెబ్ పేజిలో ఉన్న అన్ని ఫొటోలను, అన్ని వీడియోలను, డాక్యుమెంట్లు లేదా మనకు కావలసిన ఫొటోలు లేదా వీడియోలను మరియు గ్యాలరీలో ఉన్న అన్ని ఫొటోలను ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ దెమ్ ఆల్ ఫైర్ ఫాక్స్ యాడ్ ఆన్ ని ఎలా ఉపయోగించాలో About dTa! లో వీడియోలలో వివరించబడింది.

డౌన్ లోడ్ దెం ఆల్ యాడ్ ఆన్ ని తెరవడం
 
 డౌన్ లోడ్ దెం ఆల్ మేనేజర్ని తెరిచి అక్కడ ఉన్న + బటన్ని నొక్కినపుడు క్రింది చిత్రంలో వలే మరొక విండో తెరవబడుతుంది. దానిలో మనం డౌన్ లోడ్ చేయాలనుకున్న గ్యాలరీకి సంభందించిన వెబ్ చిరునామాని మరియు ఎక్కడ సేవ్ చెయ్యాలి అన్నదాన్నిని సెట్ చేసుకొని స్టార్ట్ బటన్ని నొక్కితే మనకు కావలసిన చిత్రాలు పూర్తి రిజొల్యూషన్ తో ఒకదాని తరువాత ఒకటి డౌన్ లోడ్ చేయబడతాయి.

డౌన్ లోడ్ దెం ఆల్ మేనేజర్

 చిత్రాల యొక్క వెబ్ చిరునామాను ఎలా ఇవ్వాలి?
  మొదట ఒక చిత్రం యొక్క వెబ్ చిరునామాను తీసుకొని దానినిలో ఫొటో యొక్క సంఖ్య ని మనకు కావలసిన చిత్రాల ను బట్టి ఆ గ్యాలరీలో ఉన్న చిత్రాల సంఖను బట్టి [ఈ చిత్రం నుండి:ఈ చిత్రం వరకు] ఇలా మార్చుకోవాలి. ఉదాహరణకు www.example.org లో వంద చిత్రాలు ఉన్నాయనుకుంటే మొదటి చిత్రం యొక్క చిరునామా www.example.org/image1.jpg అనుకుంటే 1ని [1:100] గా మార్చుకోవాలి. అపుడు ఆ చిరునామా ఇలా ఉంటుంది. www.example.org/image[1:100]. ఆ చిరునామాని డౌన్ లోడ్ దెం ఆల్ మేనేజర్లో ఇచ్చి అన్ని చిత్రాలను ఒకేసారి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.