ఆండ్రాయిడ్ ఫోన్లలో యాడ్స్ రాకుండా చేయడానికి

 ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారు వివిధ ఫ్రీ ఆప్స్ ప్లే స్టోర్ నుండి ఇన్ స్టాల్ చేసుకుంటారు. ఉచితంగా లభించే ఈ ఆప్స్ లో యాడ్స్ తరచు విసిగిస్తుంటాయి. అంతే కాకుండా ఫోన్ ద్వారా వెబ్ సైట్లు చూస్తున్నపుడు వెబ్ బ్రౌజర్ లో కూడా యాడ్స్ కనిపిస్తుంటాయి. వాటి వలన మన డాటా వినియోగం పెరుగుతుంది. ఈ యాడ్స్ ని అరికట్టడానికి గేమ్స్ ఆడుతున్నపుడు నెట్ ఆన్ చెయ్యకపోవడం ద్వారా ఉచిత గేమ్స్ లో వచ్చే యాడ్స్ ని అరికట్టవచ్చును. కాని వెబ్ ఆధారిత అప్లికేషన్ లు వాడుతున్నపుడు వాటిలో యాడ్స్ ని తొలగించడానికి తప్పకుండా యాడ్ బ్లాక్ ప్లస్ ఉండాల్సిందే.

ఆంగ్రీ బర్డ్స్ ఆడుతున్నపుడు యాడ్స్

 యాడ్ బ్లాక్ ప్లస్ ని ప్లే స్టోర్ నుండి తొలగించారు. కనుక మనం దీనిని F-డ్రయిడ్ నుండి కాని .apk ని దింపుకొని ఇన్ స్టాల్ చేసుకోవాలి. యాడ్ బ్లాక్ ప్లస్ .apk ని ఇక్కడ నుండి దింపుకోవచ్చు. .apk ఫైళ్ళని ఇన్ స్టాల్ చేయడం గురించి ఇక్కడ చూడవచ్చు. రూట్ చెయ్యబడిన పరికరాలలో యాడ్ బ్లాక్ ప్లస్ మొబైల్ మరియు వైఫి నెట్ వాడుతున్నపుడు అప్లికేషన్లలో మరియు వెబ్ బ్రౌజింగ్ లో ఉండే యాడ్స్ ని పూర్తిగా తొలగిస్తుంది. ఇక రూట్ చెయ్యని పరికరాలలో మాత్రం వైఫి నెట్ వర్క్ ని ఇక్కడ చెప్పినట్లు కాన్ఫిగర్ చేసుకుంటే వైఫి నెట్ యాడ్స్ ని నిరోధించవచ్చు. రూట్ చెయ్యని పరికరాలలో మొబైల్ నెట్ కి యాడ్ బ్లాక్ ప్లస్ పనిచేయదు. కనుక వెబ్ బ్రౌజింగ్ వరకు ఫైర్ ఫాక్స్ ని వాడితే యాడ్ బ్లాక్ ప్లస్ యాడ్ ఆన్ ని ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా యాడ్స్ ని నిరోధించవచ్చు.