రేపటి నుండి 14000 రూపాయలకే ఈ ఐ ఫోన్

స్మార్ట్ ఫోన్లలో ఐ ఫోన్ కి ఉన్న ప్రత్యేకత అందరికి తెలిసినదే. ఫోన్ల నాణ్యత విషయంలో దీనినే ప్రామాణికంగా తీసుకుంటారు అనడం అతిశయోక్తి కాదు. నాణ్యత, పనితీరులలో ఏవిధంగా రాజిపడకుండా ఉంటుందో ధర కూడా అలానే ఉంటుంది. ధర బాగా ఎక్కువగా ఉండడం వలన ఇది సంపన్నుల ఫోను గానే ఉంటు వస్తుంది. ఇప్పటికి చాలా మందికి ఐ ఫోన్‌ కలల
ఫోన్ గానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఈ ఐ ఫోను మధ్యతరగతి వారికి కూడా అందుబాటు ఉండే విధంగా 14000 రూపాయల ధరలో రానుంది. కాకపోతే ఇది ధర ఎక్కువగా ఉండే ఆపిల్ వారి ఐ ఫోను కాదు. చైనా ఆపిల్ గా పిలవబడే Xiaomi కంపెనీ వారి ప్రతిష్టాత్మకమైన Mi 3. ఈ ఫోను ఐ ఫోనుని మించిన స్పెసిఫికేషన్‌తో ఇంచుమించు అదే నాణ్యతతో ఇప్పుడు భారతదేశంలో విడుదలవుతుంది.
వివిధ చైనా ఫోన్‌లు మంచి స్పెసిఫికేషన్‌తో తక్కువ ధరకి ఇప్పుడు అందుబాటులో ఉన్నప్పటికి వాటి నాణ్యత, పనితీరు మరియు మన్నికలలో మనం వాటిని విశ్వసించలేము. అయితే చవక చైనా ఫోన్ల కంపెనీలతో ఈ Xiaomiని పోల్చలేము. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడు పోతున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఇది ఆరో స్థానంలోను మరియు చైనాలో మూడో స్థానంలోను ఉంది. చైనా ఆపిల్‌గా పిలవబడే ఈ కంపెనీ గూగుల్ వారి ఆండ్రాయిడ్ వైస్ ప్రెసిడెంట్‌ని తమ సంస్థలో చేర్చుకోవడం ద్వారా టెక్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆండ్రాయిడ్ ఆధారిత మియూఐతో ఫోన్‌లను తయారుచేసే ఈ సంస్థ చైనా, హాంకాంగ్, తైవాన్ మరియు సింగపూర్‌లలో తమ ఫోన్‌లను అమ్ముతుంది. ఇప్పటి వరకు కోటికి పైగా అమ్ముడు పోయిన ప్రతిష్టాత్మకమైన Mi 3 ఫోనుతో భారతదేశంలో అడుగు పెడుతుంది. ఈ Xiaomi Mi 3 మోటో జి మాదిరిగానే ఒక్క ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా రేపటినుండి అందుబాటులోకి వస్తుంది.
ఇక ఫోను విషయానికొస్తే Xiaomi Mi 3 స్పెసిఫికేషన్లతో సమానమైన ఫోన్‌లు దీని ధర కన్నా రెట్టింపు లేదా ఇంకా ఎక్కువ ధరలోనే ఉన్నాయి. ధరే కాకుండా దీని పనితీరు, మన్నిక, నాణ్యత కూడా దీనికన్నా ఎక్కువ ఖరీదు గల ఫోన్‌లను మించి ఉండడం, వివిధ టెక్ రివ్యూలలో మరియు వాడినవారి నుండి మంచి రేటింగ్‌లను పొందినది. 14000 రూపాయలలో అందుబాటులో ఉన్న పూర్తి హెచ్‌డి రెజల్యూషన్‌ ఫొన్‌ ఇదే.
  • క్వాల్‌కం స్మార్ట్‌డ్రాగన్ 800 8274AB క్వాడ్రకోర్ 2.3 గిగాహెర్ట్‌జ్ సిపియు మరియు ఆడ్రినో 330 450MHz జిపియు. 
  • 2జిబి రామ్‌, 16 జిబి స్టోరేజ్.
  • పూర్తి హెచ్‌డి వీడియో రికార్డింగ్‌కి మద్దతునిచ్చే ముందు 2, వెనుక 13 మెగాపిక్సెల్ కెమేరాలు మరియు డ్యూయల్ ఫ్లాష్.
  • 3050 యమ్‌ఎహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ.
  •  జిపియస్, యన్‌ఎఫ్‌సి, బ్లూటూత్4, యుయస్‌బి ఒటిజి మరియు డ్యూయల్ బాండ్ వైఫి.
  • 5 ఇంచ్, 1920x1080 రెజొల్యూషన్‌తో మరియు 441పెక్సెల్ పర్ ఇంచ్ తో పూర్తి హెచ్‌డి తాకే తెర. 
  • మెగ్నీషియం, అల్యూమినియం మిశ్రమలోహంతో లోపలా బయట అద్బుతమైన దృడనిర్మాణం.
  • ఆండ్రాయిడ్ కిట్‌కాట్ ఆధారిత మియుఐ 5 ఆపరేటింగ్ సిస్టం .
తక్కువ ధర కి మంచి స్పెసిఫికేషన్‌లతో వస్తున్న ఈ ఫోన్ మధ్యతరగతి ఆపిల్ ఫొన్‌ కలను తీర్చుతుందో సగటు చైనా ఫోనులా మిగిలిపోతుందో తొందరలో తెలుస్తుంది. అయితే ముందస్తుగానే సర్వీస్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసి పక్కా ప్రణాళికతో బరిలో దిగబోతుండడం మరింత ఆశక్తి కలిగిస్తుంది. మరింత సమాచారం కోసం అధికారిక సైటును ఇక్కడ చూడండి.