అకౌంట్, ప్లగిన్ రహిత వీడియో చాట్‌తో ఫైర్‌ఫాక్స్ 34 వచ్చేసింది.

సరికొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు మన ముందుంచుతూనే వాడుకరి గోప్యతకు ప్రాధాన్యతనిచ్చే వెబ్‌ బౌజర్ ఫైర్‌ఫాక్స్ నిన్న కొత్త వెర్షను విడుదలైనది. ఎప్పటిలాగే ఈ వెర్షనులో కూడా పలుమార్పులు చోటుచేసుకున్నప్పటికి వాటిలో ముఖ్యమైనవి ఫైర్‌ఫాక్స్ హలో మరియు సులభంగా థీమ్ మార్చుకొనే సౌకర్యం.
ఫైర్‌ఫాక్స్ హలో ని ఉపయోగించి మనం ఎటువంటి ప్లగిన్‌లు లేదా అధనపు సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకునే అవసరం లేకుండానే వీడియో చాటింగ్ చేసుకోవచ్చు. ఈ ఫర్‌ఫాక్స్ హలో వెబ్ ఆర్‌టిసి ఏపిఐ ఆధారంగా పనిచేస్తుంది. వెబ్ ఆర్‌టిసి ఏపిఐ జావా స్క్రిప్ట్, హెచ్‌టిఎమ్‌ఎల్ 5 ని ఉపయోగించుకొని తయారుచేయబడింది. ఇది ఫైర్‌ఫాక్స్, క్రోమ్‌ మరియు ఒపెరా బౌజర్లలో పనిచేస్తుంది.
ఇక ఫైర్‌ఫాక్స్ హలో విషయానికొస్తే దీనిని మనం about:config అని చిరునామా బార్ లో కొట్టినపుడు వచ్చే ఆప్షన్‌లలో చేతనం చేసుకోవాల్సిఉంటుంది. చాట్ లంకెను మనం చాట్ చేయాలనుకునే వారికి పంపించడం ద్వారా ఎటువంటి అకౌంట్ రిజిస్టరు చెసుకోకుండానే ఈ ఫైర్‌ఫాక్స్ హలో తో వీడియో చాట్‌ చేసుకోవచ్చు. అడ్రస్ బుక్ వంటి అధనపు సదుపాయాల కోసం ఫైర్‌ఫాక్స్ ఖాతా తెరవాల్సివుంటుంది. 
ఫైర్‌ఫాక్స్ హలో
విడియో చాట్
 
ఫైర్‌ఫాక్స్ థీమ్‌ మార్చుకోవడానికి