ఈ స్మార్ట్‌ఫోన్ ధర కొంచెం, ఫీచర్లు ఘనం

వేగంగా వృద్ది చెందుతున్న, ఇంకా వృద్ది చెందడానికి అవకాశం ఉన్న భారత స్మార్ట్‌ఫోన్ విపణి ఇప్పుడు అన్ని కంపెనీలకు ప్రధాన లక్ష్యంగా మారింది. చిన్న, మధ్యతరగతి తయారీదారులే కాకుండా దిగ్గజసంస్థలు కూడా మన దేశవిపణి పై ఆశక్తి చూపిస్తూ వారి ఉత్పత్తులతో ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా తక్కువ ధరలో మంచి ఫీచర్లను అందించే స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి, భవిష్యత్తులో
మరిన్ని ఫోన్‌లు రాబోతున్నాయి. రాబోతున్న ఫోన్‌లలో ముఖ్యంగా చెప్పుకోవలసిన స్మార్ట్‌ఫోన్ "యురేకా". 

ఈ యోరెకా ఫోన్‌ని దేశియ అతిపెద్ద ఫోన్ల తయారీదారు మైక్రోమ్యాక్స్‌, ఆండ్రాయిడ్ అధారిత ఒపెన్‌సోర్స్ ఆపరేటింగ్ సిస్టం సయనోజెన్‌మోడ్ కలిసి తయారుచేస్తున్నాయి. దీనిని మైక్రోమాక్స్ బ్రాండ్‌పై కాకుండా"యు" అనే మరొక బ్రాండ్ పై విడుదలచేస్తుంది.
  ఆండ్రాయిడ్ 4.4 (కిట్‌కాట్) అధారిత సైనోజెన్‌మోడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో విడుదలయ్యే ఈ ఫోను వచ్చే సంవత్సరం జనవరి రెండోవారం నుండి అమేజాన్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ యొక్క ముఖ్య ఫీచర్లు.
  • క్వాల్‌కం 1.5 GHz ఆక్టకోర్ 64 బిట్ ప్రాససర్.
  • 2జిబి రామ్‌.
  • 16 జిబి నిల్వ సామర్ధ్యం, 32 జిబి వరకు పెంచుకునేందుకు మెమోరీ కార్డు స్లాట్.
  • గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో 5.5 అంగుళాల హెచ్‌డి (1280*720) తెర.
  • ఆండ్రాయిడ్ 4.4 (కిట్‌కాట్) అధారిత సైనోజెన్‌మోడ్ 11 ఆపరేటింగ్ సిస్టం.
  •  ముందు 5 వెనుక 13 మెగాపిక్సెళ్ళ కెమేరాలు.
  • రెండు సిమ్‌లు, 4జి నెట్‌వర్క్‌కి మద్దతు.
  • 2500 యమ్‌ఎహెచ్ బ్యాటరీ.
  • ధర 8999 రూపాయలు.
 కొసమెరుపు: రూట్‌ చేసినప్పటికి వారెంటీ వర్తిస్తుందంట.