ఫైర్‌ఫాక్స్ లో వీడియో చాట్ ఆప్షన్‌ రావట్లేదా?

ఫైర్‌ఫాక్స్ తన కొత్త వెర్షను 34 తో ఫైర్‌ఫాక్స్ హలో అనే ప్లగిన్ మరియు అకౌంట్ రహిత వీడియో చాట్ సేవను ప్రారంభించినది. ఈ వెబ్ ఆర్‌టిసి అధారిత విడియో చాట్ కొత్త వెర్షను ఫైర్‌ఫాక్స్ ఇన్‌స్టాల్ చేసుకొన్న వారందరికి చాట్ బటన్ రావట్లేదు. ఎందుకంటే మొజిల్లా సంస్థ సర్వర్ పరిమితుల కారణంగా పది శాతం మంది వాడుకర్లకు మాత్రమే ఈ
సేవను అందించబోతుంది. బవిష్యత్తులో అందరికి విడియో చాట్ సేవను అందించబోతుంది. అయితే మనం చిన్న సెట్టింగుని మార్చుకోవడం ద్వారా ఫైర్‌ఫాక్స్ హలోని చేతనం చేసుకోవచ్చు. about:config చిరునామాకి వెళ్ళి అక్కడ loop.throttled అన్న సెట్టింగుని false గా పెట్టి ఫైర్‌ఫాక్స్‌ని రిస్టార్ట్ చేసి పానల్ కస్టమైజ్ ఆప్షన్‌కి వెళ్ళి చాట్ గుర్తును మనకు కావలసిన దగ్గరికి లాగి పెట్టుకోవాలి. అది ఎలానో క్రింది విడియోలో చూడవచ్చు.