ఫైర్ ఫాక్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫైర్ ఫాక్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఫైర్‌ఫాక్స్ వీడియో చాట్

ఎటువంటి అకౌంట్ మరియు సాఫ్ట్‌వేరు అవసరం లేకుండానే వీడియో చాట్ చేయడానికి ఫైర్‌ఫాక్స్ కొత్తగా ఫైర్‌ఫాక్స్ హల్లో సర్వీసును ప్రారంభించింది. ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజరు వాడేవారు ఎటువంటి అధనపు సాఫ్ట్‌వేరు ఇన్‌స్టాల్ చేసుకోకుండానే ఫైర్‌ఫాక్స్ లేదా క్రోమ్‌ ఇన్‌స్టాల్ చేయబడిన కంప్యూటరు లేదా మొబైల్ ఉన్నవారితో ఉచితంగా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికి

ఫైర్‌ఫాక్స్ లో వీడియో చాట్ ఆప్షన్‌ రావట్లేదా?

ఫైర్‌ఫాక్స్ తన కొత్త వెర్షను 34 తో ఫైర్‌ఫాక్స్ హలో అనే ప్లగిన్ మరియు అకౌంట్ రహిత వీడియో చాట్ సేవను ప్రారంభించినది. ఈ వెబ్ ఆర్‌టిసి అధారిత విడియో చాట్ కొత్త వెర్షను ఫైర్‌ఫాక్స్ ఇన్‌స్టాల్ చేసుకొన్న వారందరికి చాట్ బటన్ రావట్లేదు. ఎందుకంటే మొజిల్లా సంస్థ సర్వర్ పరిమితుల కారణంగా పది శాతం మంది వాడుకర్లకు మాత్రమే ఈ

అకౌంట్, ప్లగిన్ రహిత వీడియో చాట్‌తో ఫైర్‌ఫాక్స్ 34 వచ్చేసింది.

సరికొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు మన ముందుంచుతూనే వాడుకరి గోప్యతకు ప్రాధాన్యతనిచ్చే వెబ్‌ బౌజర్ ఫైర్‌ఫాక్స్ నిన్న కొత్త వెర్షను విడుదలైనది. ఎప్పటిలాగే ఈ వెర్షనులో కూడా పలుమార్పులు చోటుచేసుకున్నప్పటికి వాటిలో ముఖ్యమైనవి ఫైర్‌ఫాక్స్ హలో మరియు సులభంగా థీమ్ మార్చుకొనే సౌకర్యం.

సంస్కారవంతమైన వెబ్‌బ్రౌజర్ కొత్త వెర్షన్ విడుదలైంది

నెట్ చూడాలి అంటే "e" నే అనే పరిస్థితి మార్చిన వెబ్‌ బ్రౌజర్, మనం కావాల్సినది కాకుండా అవసరంలేని పాపప్‌లు, ప్రకటనలు తెరవబడుతు సమయాన్ని వృధా చేయడాన్ని నివారించిన వెబ్‌ బ్రౌజర్, టాబ్‌ బ్రౌజింగ్ తో వెబ్‌ విహరణాన్ని సులభతరం చేసిన వెబ్‌ బ్రౌజర్, సామాన్యుల నుండి డెవలపర్ల వరకు అందరి ఆదరణ పొందిన బ్రౌజర్, యాడ్ ఆన్లతో వెబ్

కంప్యూటరులో పనిచేసుకుంటూనే మన ఫోన్‌కి వచ్చిన కాల్ మరియు మెసేజిలను చూడవచ్చిలా

మనం కంప్యూటరులో పనిచేసుకుంటున్నపుడు ఏదైనా ఫోన్ లేదా మెసేజి మన ఫోన్ కి వచ్చిందంటే మనం చేస్తున్న పనిని ఆపి ఫోన్ చూడవలసివస్తుంది. ఆలా అవసరం లేకుండానే మన కంప్యూటరులోనే మనకు వచ్చిన ఫోన్ లేదా మెసేజి వివరాలు నోటిఫికేషన్‌గా చూపించబడాలంటే మన ఆండ్రాయిడ్ ఫోనులో ఈ చిన్న యాప్ ఉండవలసిందే. అదే పుష్‌బుల్లెట్.

ఈ ఆండ్రాయిడ్ వెబ్‌బ్రౌజర్ ఒక్కటే కానీ భాషలు 55

ప్రముఖ వెబ్‌బ్రౌజర్ ఫైర్‌ఫాక్స్ ఇప్పటికే తెలుగుతో పాటు 80 కి పైగా భాషలలో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. విండోస్,మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్‌సిస్టంలకు పలు భాషల్లో ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజర్ లభిస్తుంది. మనకు కావల్సిన భాషలో ఫైర్‌ఫాక్స్ ని ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌కి మాత్రం ఈ విధంగా పలు

2000 రూపాయలకే స్మార్ట్‌ఫోన్

స్మార్ట్‌ఫోన్ తయారీదారులను విశేషంగా ఆకట్టుకుంటున్న భారత విపణిలోకి చౌక ధరలో స్మార్ట్‌ఫోన్‌లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. కంపెనీలన్ని భారతదేశంలో విస్తరించడానికి ఎక్కువ అవకాశం ఉన్న దిగువ మరియు మధ్య శ్రేణి విపణిని లక్ష్యంగా చేసుకున్నాయి. ముఖ్యంగా దిగువ, మధ్యతరగతి స్మార్ట్‌ఫోన్‌లలో ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌లదే

ఫైర్‌ఫాక్స్, తండర్ బర్డ్ కొత్త వెర్షన్లు విడుదల

ప్రముఖ ఒపెన్ సొర్స్ వెబ్ బ్రౌజర్ పైర్‌ఫాక్స్ కొత్త వెర్షన్ 31 విడుదలైనది. ఈ ఉచిత వెబ్ బ్రౌజర్‌ని విండోస్, లినక్స్, మాక్ మరియు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కొత్త వెర్షన్‌లో చేర్చిన ముఖ్య ఫీచర్లు కొత్త ట్యాబ్ పేజిలో సెర్చ్ మరియు డౌన్‌లోడ్ చేసుకున్న ఫైళ్ళలో మాల్‌వేర్లని నిరోదించడం. ఫైర్‌ఫాక్స్ ని ఇక్కడ నుండి డౌన్‌లోడ్

మొట్టమొదటి తెలుగు మొబైల్ వెబ్ బ్రౌజర్

      ఇప్పుడు వస్తున్న కొత్త ఫోన్‌లలో అన్ని మొబైల్ వెబ్ బ్రౌజర్‌లలో తెలుగు సరిగానే కనిపిస్తుంది. దీనికి కారణం ఆండ్రాయిడ్ 4.2.2 వెర్షనులో తెలుగు ఫాంట్‌ ఉండడం. 4.2.2 తరువాత వస్తున్న వెర్షన్‌లలో కూడా తెలుగు బాగానే కనిపిస్తుంది. తక్కువ ధరలో లభిస్తున్న ఫోన్‌లలో కూడా ఇప్పుడు 4.2.2 లేదా తరువాతి వెర్షన్‌లు ఉండడం మనం గమనించవచ్చు. పాత ఫోన్‌లలో ఇప్పటికి తెలుగు చూడాలంటే తయారీదారు ఫాంటు ఇవ్వడంకాని మనం రూట్ చేసుకొని ఫాంట్ ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. 
         ఇప్పుడు తెలుగులో మొట్టమొదటి వెబ్ బ్రౌజర్ రాబోతుంది. మనం ఫైర్‌ఫాక్స్ డెస్క్‌టాప్ బ్రౌజర్‌ని గమనిస్తే మనకు వివిధ భాషలలో అందుబాటులో ఉంది. అలాగే ఆండ్రాయిడ్ ఫైర్‌ఫాక్స్ కూడా ఇప్పుడు తెలుగుతో సహా పలుభాషలలో రాబోతుంది. అయితే విడుదలకు ముందే మనం ఇప్పుడే వాడుకోవచ్చు. అభివృద్ది దశలో ఉన్న ఈ వెర్షనును అరోరా అంటారు. దీనిని ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ apk ఫైల్‌ని మనం ఆండ్రాయిడ్ ఫోన్‌లు మొబైళ్ళలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఏవైనా సమస్యలుంటే మొజిల్లా వారికి ఇక్కడ చెప్పినట్లు నివేదించడం ద్వారా మంచి విడుదలకు మనం కూడా సహాయపడవచ్చు. మరింకెందుకు ఆలస్యం తెలుగు భాషాభిమానులారా మీ వంతు సహాయం చెయ్యండి. మొదటి తెలుగుమొబైల్ వెబ్ బ్రౌజర్ స్క్రీన్‌షాట్లు క్రింద చూడండి.






వేగవంతమైన వెబ్‌ బ్రౌజర్ సరికొత్త రూపంతో విడుదలైంది

 వేగవంతమైన మరియు ఉచిత ఒపెన్ సోర్స్ వెబ్‌ బ్రౌజర్ ఇప్పుడు కొత్త ఫీచర్లతో కొత్త వెర్షనుగా విడుదలైంది. అదే ఫైర్‌ఫాక్స్ 29. ఈ వెర్షనులో ఫైర్‌ఫాక్స్ ఆస్ట్రలిస్ అను సరికొత్త రూపంతో విడుదలైంది. మొజిల్లా ఫైర్‌ఫాక్స్ మనకి అన్ని రకములైన ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేస్తుంది. అదేవిధంగా తెలుగుతో సహా 80 కి పైగా భాషలలో మనకి అందుబాటులో ఉంది. మనకు కావలసిన ఆపరేటింగ్ సిస్టంకి మనకి కావలసిన భాషలో ఇక్కడ నుండి దిగుమతి చేసుకోవచ్చు.
 
ఫైర్‌ఫాక్స్ కొత్త రూపం ఆస్ట్రలిస్

వేరే వాళ్ళ కంప్యూటర్లో వెబ్ బ్రౌజింగ్ చేస్తుంటే ఇది మీకు తప్పక ఉపయోగపడుతుంది

 మనం వెబ్ బ్రౌజింగ్ చేసేటప్పుడు మనం చూసిన వెబ్ పేజిలు, మరియు వివిధ సైట్లలో మన సెట్టింగులు వంటి సమాచారం కంప్యూటర్లో దాయబడుతుంది. ముఖ్యంగా మనం వేరే వాళ్ళ కంప్యూటర్లు లేదా ఇంటర్‌నెట్ సెంటర్‌లో మనం వెబ్ బ్రౌజింగ్ చేసిన తరువాత ఎవరైనా మన బ్రౌజింగ్ చరిత్రని సులభంగా తెలుసుకోవచ్చు. మనం వేరేవాళ్ళ కంప్యూటర్లో నెట్ వాడవలసినపుడు ఈ చిన్న చిట్కా అనుసరిస్తే మన బ్రౌజింగ్ సమాచారాన్ని ఇతరులు చూడకుండా చేయవచ్చు. మనం తాత్కాలికంగా వాడబోతున్న కంప్యూటర్లో ఫైర్‌ఫాక్స్ వెబ్ బ్రౌజర్ని ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌లో ఒపెన్ చేసి వెబ్ బ్రౌజింగ్ చేస్తే మనం చూసిన వెబ్ సైట్ల తాలుకు సమాచారం ఏది కంప్యూటర్లో సేవ్ చెయ్యబడదు. క్రింది చిత్రంలో చూపించినట్లు లేదా ఫైర్‌ఫాక్స్ ఐకాన్‌ని రైట్ క్లిక్ చేసి ఈ ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ లోకి వెళ్ళవచ్చు. ఈ ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ కూడా మనం మామూలుగా వాడే ఫైర్‌ఫాక్స్ లాగే ఉంటు అన్ని ఫైర్‌ఫాక్స్ ఫీచర్లు పనిచేస్తాయి. రెండిటికి తేడా కేవలం ఎటువంటి బ్రౌజింగ్ డాటాని కంప్యూటర్లో సేవ్ చెయ్యకపోవడమే. అందువలన బయటి సిస్టంలు అనగా ఇంటర్ నెట్ సెంటర్లు మరియు కార్యాలయాలు వంటి చోట మన సమాచారం సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ ప్రైవేట్ బ్రౌజింగ్ ని వాడుకోవచ్చు.

ఫైర్‌ఫాక్స్ లో పైవేట్ బ్రౌజింగ్ మోడ్‌ని తెరవడం
 
ఫైర్‌ఫాక్స్ ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ విండో

ఫైర్‌ఫాక్స్ కొత్త రూపం

విండోస్,మాక్ మరియు ఉబుంటు లో ఫైర్‌ఫాక్స్ కొత్తరూపం ఆస్ట్రాలిస్

 సాధారణంగా ఫైర్‌ఫాక్స్ వాడుతున్నవారు వెర్షన్‌కి వెర్షన్‌కి రూపంలో పెద్దగా మార్పులు లేకపోవడం గమనించే ఉంటారు. నిజానికి ఫైర్‌ఫాక్స్ కొంత వెనకబడడానికి ఇది కూడా కొంత కారణం కావచ్చు. దానిని అధికమించడానికి తొదరలో మొజిల్లా ఫౌండేషన్ వారు కొత్త రూపంతో ఫైర్‌ఫాక్స్‌ని విడుదలచేయబోతున్నారు. ఈ కొత్త రూపం ఇప్పుడు ఎక్కువగా వాడుతున్న తాకేతెరలకు అనుగుణంగా ఆధునికంగా ఉండడమే కాకుండా ఆకర్షణీయంగాను ఉండబోతుంది. అభివృద్ది దశలో ఉన్న ఈ ఫైర్‌ఫాక్స్ కొత్త రూపాన్ని అస్ట్రాలిస్ గా వ్యవహరిస్తున్నారు. కొత్త రూపంతో ఉన్న ఫైర్‌ఫాక్స్ ని ఇప్పుడే ఇక్కడ నుండి దింపుకొని ప్రయత్నించవచ్చు. అస్ట్రాలిస్ యొక్క ఫీచర్లను రూపాన్ని క్రింది వీడియోలో చూడవచ్చు.

ఫైర్ ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంని కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేయడం

 ప్రముఖ వెబ్ బ్రౌజర్ ఫైర్ ఫాక్స్ ని తయారు చేసిన మొజిల్లా ఫౌండేషన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ని తయారుచేసింది. ఫైర్ ఫాక్స్ ఒయస్ గా వ్యవహరించే ఈ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం తో ఇప్పటికే ఫోన్లు విడుదలైనాయి. ఇంకా మన దేశంలో విడుదలకాని ఈ ఫోన్ ఒయస్ ని మన కంప్యూటర్లో ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ లోనే ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మొదట ఫైర్ ఫాక్స్ ఒయస్ స్టిమ్యులేటర్ అన్న యాడ్ ఆన్ ని ఇన్ స్టాల్ చేసుకోవాలి. తరువాత క్రింది చిత్రాలలో చూపించినట్లు ఫైర్ ఫాక్స్ ఫోన్ ఒయస్ ని మన కంప్యూటర్లో చూడవచ్చు అంతేకాకుండా మొబైల్ అప్లికేషన్లని ఇన్ స్టాల్ చేయవచ్చు.

ఫైర్ ఫాక్స్ ఒయస్ ని తెరవడం


ఫైర్ ఫాక్స్ మొబైల్ ఒయస్ స్టిమ్యులేటర్

అందరికి ఉపయోగపడే ఫైర్ ఫాక్స్ కీ బోర్డ్ షార్ట్ కట్స్

 
 
  వేగవంతమైన వెబ్ బ్రౌజర్ ఫైర్ ఫాక్స్ లో  బ్రౌజింగ్ మరింత వేగంగా మార్చే కీబోర్డ్ షార్ట్ కట్లు 
 
  1. వెబ్ పేజిని రిలోడ్ చేయడానికి   F5
  2. వెబ్ పేజిలో ఎక్కడ ఉన్న వెబ్ పేజి చివరికి చేరుకోవడానికి   End
  3. వెబ్ పేజిలో ఎక్కడ ఉన్న వెబ్ పేజి మొదటికి చేరుకోవడానికి  Home
  4. వెబ్ పేజిలో ఉన్న సమాచారం పెద్దదిగా చూడడానికి   Ctrl++
  5. వెబ్ పేజిలో ఉన్న సమాచారం చిన్నవిగా చూడడానికి   Ctrl+-
  6. వెబ్ పేజిలో ఉన్న సమాచారం ఉన్నది ఉన్నట్టు చూడడానికి   Ctrl+o
  7. వెబ్ పేజిలో మనకుకావలసిన పదాలను వెతకడానికి   Ctrl+f
  8. ఇప్పుడు మనం చూస్తున్న టాబ్ ని మూసెయ్యడానికి   Ctrl+w
  9. కొత్త టాబ్ ని తెరవడానికి   Ctrl+t
  10. కొర్ర విండోని తెరవడానికి    Ctrl+n
  11. సైడ్ బార్ లో మన బ్రౌజింగ్ హిస్టరీని చూడడానికి   Ctrl+h
  12. డౌన్లోడ్స్ విండో తెరవడానికి   Ctrl+Shift+y
  13. మూసివేయబడిన టాబ్ ని తిరిగి తెరవడానికి   Ctrl+Shift+t
  14. మూసివేయబడిన విండో ని తిరిగి తెరవడానికి   Ctrl+Shift+n
  15. వెబ్ పేజి యొక్క సోర్స్ ని చూడడానికి   Ctrl+u
  16. కొత్త ప్రవేట్ విండో తెరవడానికి   Ctrl+Shift+p
  17. వెబ్ పేజిని బుక్  మార్క్ చేయడానికి   Ctrl+d
  18. బుక్ మార్క్ మేనేజర్ ని తెరవడానికి   Ctrl+Shift+b
  19. డెవలపర్ టూల్ బార్ ని తెరవడానికి   Ctrl+F2
  20. వెబ్ పేజిలో ఎక్కడ ఉన్న అడ్రస్ బార్ కి చేరుకోవడానికి   F6
  21. హిస్టరీని తొలగించి పేజిని రిలోడ్ చేయడానికి  Ctrl+F5
  22. యాడ్ ఆన్ బార్ ని తెరవడానికి   Ctrl+/

ఇంకా మన దగ్గర విడుదలకాని ఫైర్ ఫాక్స్ మొబైల్ ఒయస్ చిత్రాలు

 ప్రముఖ ఒపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అయిన ఫైర్ ఫాక్స్ ఇప్పుడు మొబైల్ రంగంలోకి ప్రవేశించింది. ఫైర్ ఫాక్స్ ఒయస్ పేరుతో ఒపెన్ సోర్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం విడుదలచేసింది. ఇప్పటికే జెటియి మరియు ఆల్కాటెల్ ఫైర్ ఫాక్స్ ఒయస్ తో ఫోన్లని విడుదల చేసినప్పటికి ఇంకా మన దేశంలో విడుదలకాలేదు. లినక్స్ కర్నెల్ పై నిర్మించబడిన ఈ మొబైల్ ఒయస్ హెచ్.టి.యం.యల్.5 ఆధారంగా తయారుచేయబడినది. తొదరలొనే యల్.జి మరియు సోని కంపెనీలు ఫైర్ ఫాక్స్ ఫోన్లని విడుదలచేయబోతున్నాయి.
 ఇక ఆపరేటింగ్ సిస్టం విషయానికొస్తే తక్కువ సామర్ధ్యం గల పరికరాలలో వేగంగా పనిచేయడానికి అనువుగా దీనిని తయారుచేసారు. ఫైర్ ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం యొక్క చిత్రాలు చూడండి.
 
హోంస్క్రీన్
 
నోటిఫికేషన్

వెబ్ అప్లికేషన్లు

ఫోన్ డయలర్

అప్లికేషన్లు

ఆప్ ల కోసం మార్కెట్ ప్లేస్

పరిచయాలను చేర్చుకోవడం

తెలుగు వికిపీడియా ఆప్
తెలుగు బానే చూపిస్తున్న వెబ్ బ్రౌజర్
పేస్ బుక్ అప్

వందల కొద్దీ ఫొటోలూ ఒకే క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోనే సాఫ్ట్వేర్ ఉచితంగా

 సాధారణంగా వివిధ వెబ్ సైట్లలో గ్యాలరీలుగా ఉంచిన సినితారల ఫొటోలు లేదా ఫేస్ బుక్ వంటి సామాజిక అనుసంధాన సైట్లలో ఉంచిన బంధుమిత్రుల ఫొటోలు మన కంప్యూటర్లో సేవ్ చేసుకోవాలంటే ప్రతి ఫొటోని తెరిచి సేవ్ ఇమేజ్ అన్న ఆప్షన్ని ఉపయోగించి సేవ్ చేసుకుంటాము. ఒకటి రెండు ఫొటోలంటే ఇలా సేవ్ చేసుకోవచ్చు. కానీ వందల ఫొటోలు డౌన్లోడ్ చేయాలంటే మాత్రం ఈ పధ్దతి పనికిరాదు. దీనివలన విసుగు, సమయం వృధా కావడం జరుగుతుంది. సగటు కంప్యూటరు వాడుకరి వందల కొద్దీ ఫొటోలూ ఒకే క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోవాలంటే బల్క్ ఇమేజి డౌన్లోడర్ వంటి సాఫ్ట్వేర్లు కొనుక్కోవలసిందేనా?
 అవసరం లేదు మనం డబ్బులు పెట్టకుండా ఉచితంగా వందల కొద్దీ ఫొటోలూ ఒకే క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసే సాఫ్ట్వేర్ ఉచితంగా పొందవచ్చు. లైక్, షేర్, రిజిస్టర్ మరియు సబ్ స్రైబ్ చేసుకోకుండానే ఎవరైనా ఉచితంగా పొందవచ్చు. ఎందుకంటే ఇది పూర్తిగా ఒపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. డౌన్లోడ్ దెమ్ ఆల్ అన్న ఫైర్ ఫాక్స్ యాడ్ ఆన్ ని ఉపయోగించి ఉచితంగా వందల కొద్దీ ఫొటోలూ ఒకే క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొదట మనం డౌన్లోడ్ దెమ్ ఆల్ అను ఫైర్ ఫాక్స్ యాడ్ ఆన్ ని ఇక్కడ నుండి ఇన్ స్టాల్ చేసుకోవాలి. దీనిని ఉపయోగించి వెబ్ పేజిలో ఉన్న అన్ని ఫొటోలను, అన్ని వీడియోలను, డాక్యుమెంట్లు లేదా మనకు కావలసిన ఫొటోలు లేదా వీడియోలను మరియు గ్యాలరీలో ఉన్న అన్ని ఫొటోలను ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ దెమ్ ఆల్ ఫైర్ ఫాక్స్ యాడ్ ఆన్ ని ఎలా ఉపయోగించాలో About dTa! లో వీడియోలలో వివరించబడింది.

డౌన్ లోడ్ దెం ఆల్ యాడ్ ఆన్ ని తెరవడం
 
 డౌన్ లోడ్ దెం ఆల్ మేనేజర్ని తెరిచి అక్కడ ఉన్న + బటన్ని నొక్కినపుడు క్రింది చిత్రంలో వలే మరొక విండో తెరవబడుతుంది. దానిలో మనం డౌన్ లోడ్ చేయాలనుకున్న గ్యాలరీకి సంభందించిన వెబ్ చిరునామాని మరియు ఎక్కడ సేవ్ చెయ్యాలి అన్నదాన్నిని సెట్ చేసుకొని స్టార్ట్ బటన్ని నొక్కితే మనకు కావలసిన చిత్రాలు పూర్తి రిజొల్యూషన్ తో ఒకదాని తరువాత ఒకటి డౌన్ లోడ్ చేయబడతాయి.

డౌన్ లోడ్ దెం ఆల్ మేనేజర్

 చిత్రాల యొక్క వెబ్ చిరునామాను ఎలా ఇవ్వాలి?
  మొదట ఒక చిత్రం యొక్క వెబ్ చిరునామాను తీసుకొని దానినిలో ఫొటో యొక్క సంఖ్య ని మనకు కావలసిన చిత్రాల ను బట్టి ఆ గ్యాలరీలో ఉన్న చిత్రాల సంఖను బట్టి [ఈ చిత్రం నుండి:ఈ చిత్రం వరకు] ఇలా మార్చుకోవాలి. ఉదాహరణకు www.example.org లో వంద చిత్రాలు ఉన్నాయనుకుంటే మొదటి చిత్రం యొక్క చిరునామా www.example.org/image1.jpg అనుకుంటే 1ని [1:100] గా మార్చుకోవాలి. అపుడు ఆ చిరునామా ఇలా ఉంటుంది. www.example.org/image[1:100]. ఆ చిరునామాని డౌన్ లోడ్ దెం ఆల్ మేనేజర్లో ఇచ్చి అన్ని చిత్రాలను ఒకేసారి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మీ వెబ్ విహరిణిని పర్యావరణానికి మేలు చేయునట్లుగా మార్చుకోండి

 మనం అంతర్జాలంలో విహరిస్తున్నపుడు మనకు కావలసిన ఉపయోగపడే సమాచారం కనిపించినపుడు దానిని ముద్రించుకోవడం  లేదా మన కంప్యూటరులో బధ్రపరచుకుంటు ఉంటాము. మనం వెబ్ విహరిణి నుండి ముద్రించు కోవాలని చూసినపుడు మనం తరచు ఎదుర్కొనే సమస్య మనకు అవసరం లేని సమాచారంతో(వ్యాపార ప్రకటనలు) సరిగా లేని పేజి అమరికతో ఒక పేజితో పోయేది రెండు మూడు పేజిలు వృధా అవుతుంటాయి. ఇప్పుడు మీరు చదవబోయే చిన్న చిట్కా వలన పొందికైన పేజి అమరికతో పాటు సరిగ్గా సాధికారంగా మనకు కానలసిన సమాచారాన్ని మాత్రమే ముద్రించుకోవడం ద్వారా మనం గణనీయంగా పేజిలు ఆధా చేయవచ్చు. దానివలన పేజి మరియు ముద్రణ వెల తగ్గడంతో పాటు పరోక్షంగా పర్యావరణానికి మేలు చేయవచ్చు. సమాచారాన్ని కంప్యూటరులో బధ్రపరచుకోవాలనుకునే వారు పొందికైన పేజి అమరికతో పాటు సరిగ్గా సాధికారంగా మనకు కానలసిన సమాచారాన్ని మాత్రమే పిడియఫ్ లోకి మార్చుకొని కావలసినపుడు చదువుకోవచ్చు.
 మొదట మనం చేయవలసింది http://www.printfriendly.com/browser_tool అను లంకెకు వెళ్ళి ఆక్కడ ఇవ్వబడిన Print Friendly అన్న నీలిరంగు బొత్తాన్ని లాగి మన విహారిణి యొక్క బుక్ మార్క్ పట్టిలో పడవేయాలి. అంతే మన వెబ్ విహారిణి పర్యావరణ హితంగా మారిపోతుంది. మనం ఎదైనా వెబ్ పేజిని మద్రించు కోవాలని గాని బద్రపరుచుకోవాలని అనుకుంటే బుక్ మార్క్ పట్టిలో ఉన్న  Print Friendly ని నొక్కితే మన సమాచారం ముద్రించుకోవడానికి అనుగుణంగా మార్చబడుతుంది. మనకు అవసరం లేని సమాచారాన్ని ఒక నొక్కుతో తొలగించుకొని, అక్షరాల పరిమాణాన్ని తగినట్లు మార్చుకొని మన సమాచారాన్ని మాత్రమే మంచి పేజి అమరికతో ముద్రించుకోవడం గాని పిడియఫ్ గా కాని బద్రపరుచుకోవచ్చు లేదా నేరుగా మెయిల్ చేసుకోవచ్చు.

ఫైర్ ఫాక్స్ 20 విడుదలైంది.


 15వ వార్షికోత్సవం జరుపుకొంటున్న మొజిల్లా ఫౌండేషన్ వారు తమ తదుపరి విడుదలఅయిన ఫైర్ ఫాక్స్ 20 ని విడుదలచేసారు. సరికొత్త డౌన్ లోడ్ మేనేజర్, ప్రవేట్ బ్రౌజింగ్ మరియు పనిచేయడం ఆగిపోయిన ప్లగ్ ఇన్ ల ప్రభావం ఫైర్ ఫాక్స్ మీద పడకుండా వాటిని మూసివేయగలిగిన సామర్ధ్యం వంటి అధనపు విశిష్టతలతో పాటు పనితీరులో మెరుగుదల, HTML5 విశిష్టతలతో తీసుకువచ్చారు.
                         ఫైర్ ఫాక్స్ డౌన్ లోడ్